సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్..

196
minister srinivas goud
- Advertisement -

నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మక్తల్ ట్యాంక్ బండ్ నుంచి పట్టణానికి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సుమారు 500కు పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, జెడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్తులు, భూములకు భరోసా కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని.. దేశంలో రైతు రాజ్యం అంటేనే తెలంగాణ గుర్తుకు వస్తుందని మంత్రి తెలిపారు. ధరణి ఫోర్టల్ వల్ల భూ పంచాయతీలే ఉండవని ఆయన అన్నారు. ఓవైపు తెలంగాణ సర్కారు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నూతన రైతు విధానం, కొత్త విద్యుత్ చట్టంతో రైతుల నడ్డి విరుస్తోందని మంత్రి విమర్శించారు.

- Advertisement -