మహేష్-నమ్రత మూవీకి 20 ఏళ్లు..

174
mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘వంశీ’. ఈ సినిమా సరిగ్గా 2000 సెప్టెంబర్ 4న విడుదలైంది. ఈ మూవీ విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహేష్‌ కెరీర్‌లో అదొక డిజాస్టర్ మూవీ. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ చిత్రంలో మహేష్ బాబు, నమ్రతలు మొదటిసారి జంటగా కలిసి నటించారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించక పోయినా.. కలిసి జీవించాలని నిర్ణయం తీసుకొని ఒకింటి వారయ్యారు. మహేశ్, నమ్రతలను కలిపిన ‘వంశీ’మూవీ నేటితో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.

ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటించలేదు. మహేష్ బాబు కెరీర్‌లో చేదు గుర్తుగా మిగిలిపోయినా ఆ సినిమా. అతని జీవితానికి మాత్రం తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయా బ్యానర్‌లో మహేష్ బాబు నటించిన ఏకైక చిత్రం ‘వంశీ’. అంతేకాదు హీరో అయిన తర్వాత మహేష్ బాబు..తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పూర్తిస్థాయిలో నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. ఒక రకంగా తండ్రి కృష్ణతో పాటు..భార్య నమ్రతతో మహేష్ బాబు నటించిన ఏకైక మూవీగా ‘వంశీ’ రికార్డులకు ఎక్కింది. ఈ మూవీకి మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు.

పద్మాలయా స్టూడియో పతాకంపై ‘వంశీ’ తర్వాత ఏ సినిమా తెరకెక్కలేదు. మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ బాబు, మంజులతో పాటు ఏకంగా మహేష్ బాబు వివిధ బ్యానర్స్‌లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కెరీర్‌లో మొదట్లో వచ్చిన ఆ చిత్రం మహేష్‌బాబును ఎంతో నిరాశకు గురిచేసింది. అయినా ఆ మూవీని ఇప్పటికీ సూపర్ స్టార్ అభిమానులు గుర్తు పెట్టుకున్నారు.