1956 తర్వాత ఇక్కడే ఆవిర్భావ ఏర్పాట్లు:శ్రీనివాస్ గౌడ్

279
srinivas goud
- Advertisement -

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఎక్కడైతే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయే ఇప్పడు అక్కడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లు ను పరిశీలించారు.

అనంతరం మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ చారిత్రాత్మక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ఏర్పడినప్పుడు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉత్సవాలు జరిపారని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రజల చెమట రక్తం తో కట్టిన ఆనవాళ్ళు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉన్నాయని చెప్పారు.- కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు మరో ఏడాదిలో పూర్తి అవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ – ప్రతి ఆవిర్భావం దినోత్సవానికి ఎదో ఒక తేడా కనపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -