బీజేపీలో చేరను..తప్పుడు ప్రచారం ఆపండి

19
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను ఖండిస్తున్నా అని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..స్వలాభం గురించి కొంతమంది పార్టీ విడుతున్నారని విమర్శించారు.తాను బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని… అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు.

తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా పాలన్నారు. లక్షల కోట్లు మింగిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారని.. తెలంగాణ సమాజం బీఆర్ఎస్‌పై జరుగుతున్న కుట్రను గమనిస్తుందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చక పోతే మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అంటే పేదల పార్టీ అని.. బహుజన రాష్ట్ర సమితిగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అభినందించారు.

Also Read:మహేష్‌తో మూవీ త్వరలో ప్రారంభం!

- Advertisement -