శ్రీలంక బోర్డుకి షాకిచ్చిన ఆటగాళ్లు..!

251
sl
- Advertisement -

త్వరలో భారత్‌తో జరిగే సిరీస్‌కు ముందు ఆ దేశ బోర్డుకి షాకిచ్చారు లంక ఆటగాళ్లు. భారత్‌తో సిరీస్‌కి సంబంధించి కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్‌ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్‌ చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది.

- Advertisement -