పిల్లలు యుక్తవయసులో అడుగుపెట్టినప్పుడు హార్మోన్లలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి ప్రభావం కారణంగా వారి ప్రవర్తనలోనూ పెను మార్పులు కనిపిస్తాయి. అలాంటి మార్పులను తల్లిదండ్రులు సకాలంలో గుర్తించాలి. యుక్తవయసుకు వచ్చిన పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. అంతేగానీ `వారితో ఏం చర్చిస్తాంలే` అనే ధోరణి పనికిరాదు…అనే సందేశానికి చక్కటి వినోదాన్ని జోడించి ఓ ఎం జీ (ఆఫ్ బీట్ మీడియా గైడ్) అనే సంస్థ తెలుగు ,తమిళ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో సోమవారం జరిగింది.
నిఖిల్ దేవాదుల, అష్‌నూర్ కౌర్, అనుష్కా సేన్, చేతన్ జయలాల్, ప్రగత్ కీలక పాత్రధారులు. శ్రీకాంత్ వెలగలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ చవాన్ నిర్మాత. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు క్లాప్‌నిచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ చవాన్ మాట్లాడుతూ “ఈ నెల 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జూన్ 12వరకు హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తిచేస్తాం. ప్రముఖ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ మరాఠీలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం `బాలక్ పాలక్`కు రీమేక్ ఇది. తప్పకుండా అందరి దృష్టినీ ఆకర్షిస్తుందనే నమ్మకం ఉంది“ అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ “ఎదిగే పిల్లల బయోలాజికల్ నీడ్స్ ని తల్లితండ్రులు గుర్తించి సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. డిస్కస్ చేయాల్సిన కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేయడం వల్ల జరిగే విపత్కర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. పెద్దలకు, పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అంశాలను చర్చిస్తున్నాం. ఫక్తు కమర్షియల్ అంశాలతో మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నారు“ అని చెప్పారు.
నరేశ్, తేజస్వి మదివాడ, ఈటీవీ ప్రభాకర్, వినోద్ బాల, నళిని తదితరులు ఇతర పాత్రధారులు. చీనార్ మహేశ్, విశాల్-శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: ధర్మేంద్ర, కెమెరా: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డా. ఆకునూరు గౌతమ్, లైన్ ప్రొడ్యూసర్: శ‌్రీనివాస్ రెడ్డి న్యాల కొండ, నిర్మాత: ఆనంద్ చవాన్, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ‌్రీకాంత్ వెలగలేటి,