మహాభారతంపై మోడీ ఏమన్నారో తెలుసా..!

222
Modi supports Mohanlal’s Mahabharata
- Advertisement -

దేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో, మలయాళం సూపర్‌స్టార్ ప్రధాన పాత్రలో, ఎంటి వాసుదేవన్ రాసిన ‘రందమూజం’ నవల ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకి మహాభారతం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కేరళకు చెందిన హిందూ ఐక్య వేది అనే సంస్థ ఈ సినిమాకు మహాభారతం అనే టైటిల్‌ను పెట్టడానికి వీల్లేదంటుంది. ఆ టైటిల్ కేవలం వ్యాసుడికే సొంతమని.. ఆ పేరుతో ఎవరు సినిమా చేసిన అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా చిత్ర యూనిట్‌కు దేశ ప్రధాని మోడీ నుండి మద్ధతు లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమా ప్రొడ్యూస‌ర్ బీఆర్ శెట్టికి మోడీ ఓ లేఖ కూడా పంపిన‌ట్లు పింక్ విల్లా అనే వెబ్‌సైట్ ఓ రిపోర్ట్ వెలువ‌రించింది. దేశానికి ఈ సినిమా గ‌ర్వ‌కార‌ణంగా నిల‌వాల‌ని మోదీ ఆకాంక్షించిన‌ట్లు స‌మాచారం.

వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని, రెండు భాగాలుగా సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు శెట్టి చెప్పారు. 2020లో తొలి భాగం, త‌ర్వాత 90 రోజుల‌కు రెండో భాగం రిలీజ్ అవుతాయ‌ని తెలిపారు. మ‌ళ‌యాలంతోపాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ్‌, ఇంగ్లిష్ భాష‌ల్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మోహ‌న్‌లాల్ ఈ సినిమాలో భీముని పాత్ర పోషించ‌నుండగా జాతీయ‌, అంత‌ర్జాతీయ స్టార్ న‌టులు ఇందులో న‌టిస్తున్నారు.

- Advertisement -