శృతి మించిన శ్రీదేవి కూతురు..!

1128
- Advertisement -

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ప్రేక్షకులకు ఆమె అతిలోక సుందరి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆ క్రేజే వేరు. ఇప్పుడు ఆమె వారసురాలిగా పెద్ద కూతురు జాన్వి కపూర్‌ వెండితెర ఎంట్రీకి రెడీ అవుతుంది. జాన్వి ఎంట్రీ కోసం చాలా గ్రాండ్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు శ్రీదేవి. ఇలాంటి నేపధ్యంలో జాన్వి వ్యక్తిగత విషయాలు శ్రీదేవికి చికాకు తెప్పిస్తున్నాయట.

SRIDEVI SAYS NO BF FOR JHANVI

గత కొంత కాలంగా జాన్వి రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా బాయ్‌ ఫ్రెండ్‌తో పార్టీలకు వెళుతూ బాగానే ఎంజాయ్‌ చేస్తోంది. అయితే సినిమాల్లోకి రాకుముందే ఇంతగా రెచ్చిపోయి పబ్‌లకు వెళ్ళడమే కాకుండా జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ ఫోటోలో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపింస్తున్నాయి. ఈ కామెంట్స్ శ్రీదేవి చాలా బాధించాయట. తన కూతురు జాన్వి పై ఆగ్రహం వ్యక్తం చేసిందట అతిలోక సుందరి. సినిమాల్లోకి రాకముందే ఇలా చీప్‌గా పబ్లిసిటీ కావడంతో శ్రీదేవి,బోనికపూర్‌లు జీర్ణించుకోలేక పోతున్నారట. సినిమాల్లోకి రావాలంటే బాయ్‌ ఫ్రెండ్‌ ఉంటే రాణించలేవని కూతురికి గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చిందట శ్రీదేవి.

SRIDEVI SAYS NO BF FOR JHANVI

కాని జాన్వీ తన తల్లి వార్నింగ్‌ను ఏ మాత్రం లెక్క చేయకుండా పబ్‌లకు తన బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఇంతకీ ఈ జూనియర్‌ శ్రీదేవి బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరా అనుకుంటున్నారా..! ప్రముఖ రాజకీయనాయకుడు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అయిన శిఖర్‌ పహారియాతో డేటింగ్‌ చేస్తోంది జాన్వి. శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట.

SRIDEVI SAYS NO BF FOR JHANVI

శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు.

- Advertisement -