దివంగత అందాల తార సినీ నటి శ్రీదేవికి మరణాంతరం జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఈ మధ్యే సినీ లోకాన్ని విడిచి వెళ్లిన శ్రీదేవికి 2017 సంవత్సరానికి గానూ ‘మామ్’ చిత్రానికి అవార్డు దక్కింది. ఆమె నటనతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన నటనతో తగ్గలేదనిపించింది.
ఢిల్లీలో ఇవాళ 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటనలో జాతీయ ఉత్తమ నటిగా శ్రీదేవికి అవార్డు వరించింది. ఈమెతో పాటు గతేడాది మరణించిన వినోద్ ఖన్నాకు నేషనల్ ఫిల్మ్ జూరీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.’మామ్’ చిత్రంలో శ్రీదేవి తల్లిగా పోషించిన పాత్ర అద్భుతమని విమర్శకుల ప్రసంశలందుకుంది శ్రీదేవి.
రెండేళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి నటించిన చిత్రాల్లో శ్రీదేవి నట విశ్వరూపాన్ని చూపించారు. తాను నటించిన మామ్ చిత్రానికి గానూ అవార్డు రావటం పట్ల శ్రీదేవి అభిమనులు, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.