సిద్దిపేటలో శ్రీసత్యసాయి బాలల గుండె చికిత్స కేంద్రం ఏర్పాటైంది. కొండపాకలో కొత్తగా నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సిద్దిపేటలో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి హరీశ్ ఆనందం వ్యక్తం చేశారు.మానవ సేవయే మాధవ సేవగా భావించే మధుసూదన్ సాయి చేతుల మీదుగా విద్యాలయాలు, వైద్యాలయాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ వైద్యాలయం ద్వారా కావాల్సిన వైద్య చికిత్సలు అందిస్తామని శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయి వెల్లడించారు. మనుషుల్లో ఉండే భగవంతుని గుర్తించడమే నిజమైన మాధవ సేవ అన్నారు.
దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయడానికి ఈ సెంటర్‌ను నెలకొల్పడంతో తెలంగాణ ప్రత్యేకతను సాధించిందన్నారు. ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధితో మృత్యువాతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..