టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వారి పేర్లు బయటపెడతా: శ్రీరెడ్డి

195
sri reddy

సినీ నటి శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒక్కసారి ఈమెతో పెట్టుకుంటే అంతే సంగతులు ఇంక. బతుకు తీసి బజారులో పెట్టే వరకు నిద్ర కూడా పోదు. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటుంది శ్రీ రెడ్డి. ఈమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కళకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో ఆమె షాకింగ్‌ కామెంట్‌ చేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని శ్రీరెడ్డి ఆరోపించింది. చాలా మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారని చెప్పింది. పెద్దపెద్ద హోటల్స్ లో కూడా పార్టీలు ఏర్పాటు చేసుకుంటారని, వీటిలో డ్రగ్స్ తీసుకుంటారని తెలిపింది. అంతేకాదు ఈ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, వారిని వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు భద్రత కల్పిస్తే… టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను బయటపెడతానని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.