వర్మ బయోపిక్‌ ప్రారంభం..

169
varma

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గాపాల్‌ వర్మ ఎదిచేసినా సంచలనమే. ఆయన మాట్లాడే ప్రతీది వివాదలకు దారితీస్తుంది. ఇక వర్మ ఎన్నో బయోపిక్స్‌ను తెరకెక్కించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయనపై సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమాలో రాముగా దొరసాయి తేజ నటిస్తున్నాడు.

ఈ మూవీకి ‘రాము’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రానుంది. పార్ట్‌ 1లో రామ్‌ గోపాల్‌ వర్మ కాలేజ్‌ రోజుల్లో చేసిన సందడిని‌ చూపించనున్నారు. అందులో మొదటి పార్ట్ షూటింగ్‌ను వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా, ఆయన సోదరి విజయ ఫస్ట్ షాట్‌కు క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.