- Advertisement -
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీరెడ్డికి పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు మద్దతుగా నిలిచారు. అయితే శ్రీరెడ్డికి మొదటి నుంచి మద్దతుగా నిలిచిన నటి అపూర్వ. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై మహిళా సంఘాల ప్రతినిధులు చర్చా వేధికను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అపూర్వ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు పోరాడతామని, అయినా న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని ఆమె హెచ్చరించింది. వాస్తవాలను తాము చెబుతుంటే, కొందరు తమను అవహేళన చేస్తున్నారని తెలిపారు. తమకు మద్దతుగా నిలవకపోయిన పర్యవాలేదు కానీ, అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దని అపూర్వ కోరింది.
- Advertisement -