ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం-218

218
Rajasthan Royals to a solid total of 217/4
- Advertisement -

చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుతున్నమ్యాచ్‎లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఏర్పర్చింది . టాస్ ఓడి బ్యాటింట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కెప్టెన్ రహానె(36: 20 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్), మంచి శుభారంభం అందించగా, మరో ఓపెనర్ షార్ట్ 11 పరుగులకే వెనుదిరిగాడు. అయితే తర్వాత వచ్చిన శాంసన్ (92నాటౌట్ :45 బంతుల్లో 2ఫోర్లు, 10 సిక్స్‌లు) రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

తరువాత వచ్చిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ శాంసన్‎కు సహకారం అందించాడు. బట్లర్ 25 పరుగుల చేసి భారీ స్కోర్ దిశగా ప్రయత్నించి ఔటవడంతో క్రీజులోకి వచ్చిన త్రిపాఠి 5 బంతులు ఆడి 14 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 17వ ఓవర్ నుంచి శాంసన్ పోర్లు, సిక్సులు బాదడంతో 217/4 స్కోర్ నమోదు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్(2/20) మాత్రమే రాయల్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లు అధిక సంఖ్యలో
పరుగులు సమర్పించుకున్నారు.

- Advertisement -