అమెరికా సెక్స్ రాకెట్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

896
- Advertisement -

టాలీవుడ్‌లో మొన్నటి వరకు కాస్టింగ్ కౌచ్‌ అంటూ పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి షాక్‌ తగిలింది టాలీవుడ్‌కు అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గుట్టుగా జరుగుతున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు. కిషన్ చంద్ర అనే దంపతులు టాలీవుడ్ హీరోయిన్లను ఈవెంట్స్ పేరు చెప్పి తాత్కాలిక వీసాలతో అమెరికా తీసుకొచ్చి చేయిస్తున్న వ్యభిచారం వెలుగు చూసింది. ఈ సెక్స్ రాకెట్ తో మొత్తం టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈవ్యవహారంతో మూలిగే నక్క మీద తాటిపండు పడినటైంది టాలీవుడ్ పరిస్థితి.

Sri Reddy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం ప్రారంభించి వార్తల్లోకి ఎక్కిన నటి శ్రీరెడ్డి, అమెరికాలో తెలుగు హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ దంపతుల సెక్స్ రాకెట్ పై స్పందించింది. చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభించని ఆర్టిస్టులు నృత్య ప్రదర్శనలు, వివిధ షోల పేరిట అమెరికాకు వెళుతుంటారని చెప్పింది. అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తుంటారని, ఒక్కో హీరోయిన్ కు ఉండే పాప్యులారిటీని బట్టి డబ్బలు అందుతుంటాయని వెల్లడించింది. కాసేపు గడిపినందుకు వీరికి 1000 డాలర్లకు పైగానే ముడుతుందని చెప్పింది. కిషన్ దంపతులు తనను కూడా అమెరికాకు రావాలని సంప్రదించారని, కానీ తాను వెళ్లలేదని చెప్పింది.

Sri Reddy

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి అర్థనగ్నంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో అందరి మదిలోనూ ఉదయించిన ప్రశ్న కాస్టింగ్‌ కౌచ్‌ ఉందా.. లేదా.. బాధితులేమో ఉందంటూ బజారున పడ్డారు.. బాధించిన వారే తాము కాదంటూ ఉలిక్కిపడ్డారు.. అసలు కాస్టింగ్ కౌచ్ బయటపడ్డాక తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సమావేశమై ఏవేవో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

- Advertisement -