టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లయినా కూడా అందాల కనువిందుకు హద్దులు లేకుండా పోయాయి. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కు కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. ఎవరేమనుకున్నా నాకేంటి అంటూ రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంది. ఈ నేసథ్యంలో వివాస్పద నటి శ్రీరెడ్డి సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన హాట్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇటీవల సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ… సమంత డీసెంట్‌గా కనిపించాలని హితవు పలికారు. అక్కినేని కుటుంబంలో అమలగారి వస్త్రధారణ ఎంతో హుందాతనంతో కూడి ఉంటుందని అన్నారు. కానీ, సమంత డ్రెస్సింగ్ తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెప్పారు. మహేష్ బాబు భార్య నమ్రతను చూసి సమంత నేర్చుకోవాలని శ్రీరెడ్డి హితవు పలికారు. హీరోగా మహేష్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారని చెప్పారు. నీ భర్త నాగచైతన్య హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడని… ఆయన కెరీర్‌ను నీవు చూసుకోవచ్చు కదా? అని అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సరైన డ్రస్సులు వేసుకోవడం లేదని.. అక్కినేని అభిమానులకు అది నచ్చడం లేదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఇకనైనా నాగచైతన్య జీవితం మీద, ఆయన కెరీర్ మీద సమంత దృష్టి సారించాలని శ్రీరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.