గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న గుండ్ల పోచంపల్లి కౌన్సిలర్లు..

39
Gundlapochampally Councillors

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రామా స్థాయిలో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఉన్నత స్థాయి అధికారులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజల మన్ననలు దోచుకుంటుంది. ఒకవైపు బిగ్ బాస్ 4 సీసన్ బాగస్వామ్యులందరు స్వంచందంగా పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ తమ వంతు మద్దతు తెలుపుతున్నారు. అలానే సామాన్య ప్రజలు తమ వంతుగా మూడు మూడు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈరోజు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో బాలరాజ్ కౌన్సిలర్, దేవేందర్ కోఆప్షన్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ సంతోష్ నేటి యువతరానికి నవయుగ అశోకుడిగా, స్ఫూర్తిదాయకంగా,ఆదర్శముగా నిలుస్తున్నారని తెలిపారు.