యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో మరో చక్కటి అవకాశాన్ని అందుకుంది. శ్రీలీలకి ఇంతవరకు సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినా అవకాశాలు మాత్రం భారీగా అందుకుంటోంది. తాజాగా ఈ సొగసరి వరుణ్ తేజ్ తో తొలిసారి జోడీ కట్టబోతున్నది. వరుణ్ తేజ్ హీరోగా శ్రీరామ్ ఆదిత్యదర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమా రాబోతుంది. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూరప్, లండన్‌తో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ను జరిపేందుకు ప్లాన్ చేస్తోన్నారు.
ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమానే అయినా, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో శ్రీలీల కి ఇది మంచి అవకాశం అని తెలుస్తోంది. శ్రీలీల కూడా ఈ సినిమా కోసం అదనపు కాల్షీట్లు కేటాయించడానికి కూడా అంగీకరించింది. ప్రస్తుతం శ్రీలీల, రవితేజ సరసన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఎప్పుడో పూర్తి కావాల్సిన ఆ సినిమా మళ్లీ రీషూట్లతో కాలక్షేపం చేస్తోంది.
మరోవైపు కన్నడలో శ్రీలీల నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. తెలుగులో చేసిన పెళ్లి సందD సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా శ్రీలీల తన సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటోంది. అలాగే తమిళంలో సూర్య వనంగాన్‌తో పాటు కన్నడంలో కూడా ఓ సినిమా అంగీకరించింది. మొత్తానికి సినిమాలు ప్లాప్ హీరోయిన్ హిట్ మాదిరిగా శ్రీలీల కెరీర్ సాగుతుంది.
ఇవి కూడా చదవండి..