పుట్టినరోజున మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి..

34

ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు హరితాహారంలో భాగంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలసి జమ్మి, అల్లనేరేడు మొక్కలను నాటారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

తన జన్మదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపుతున్నారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. మనమంతా చేయి చేయి కలిపి మొక్కలు నాటి, సంరక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్న హరిత తెలంగాణ సాధించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.