ఒకరి దురదృష్టం మరోకరి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓటమి పాలు కావడంతో వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని వెస్టిండీస్ కొల్పోయింది. కరెబీయన్ జట్టు స్ధానంలో శ్రీలంక ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబరు 30నాటికి టాప్-8 జట్లు 2019లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇటీవల శ్రీలంక.. భారత్ చేతిలో 5-0తో వన్డే సిరీస్‌లో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ నుంచి కొంత పోటీ ఏర్పడింది. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌ను వెస్టిండీస్ 5-0, 4-0 తేడాతో గెలిస్తే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించేది. కానీ, మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో శ్రీలంక ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించినట్లైంది.
దీంతో రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ క్వాలిఫై మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. 2019లో వన్డే ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 30 నుంచి జూలై 15 వరకు వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్నది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
See you at #CWC19, @OfficialSLC! 🇱🇰 pic.twitter.com/RVcuZSkjP1
— ICC Cricket World Cup (@cricketworldcup) September 19, 2017