ఆసియా కప్ 2022ను కైవసం చేసుకుంది శ్రీలంక. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొంది ఆరోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుని చాంపియన్‌గా నిలిచింది. శ్రీలంక విధించిన 171 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55) అర్ధశతకంతో రాణించగా ఇఫ్తిఖార్ (32), రవుఫ్ (13) పరుగులు చేశారు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 170 పరుగులు చేసింది. ఓ దశలో 58 పరుగులకే 5 వికెట్లు కుషాల్ మెండిస్ (0), ధనుష్క గుణతిలక (1), దసున్ షనక (2), నిసాంక (8), ధనంజయ డిసిల్వ (28) కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భానుక రాజపక్స (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , హసరంగ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్), చమిక కరుణరత్నె (14 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. భానుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.

