బిగ్ బాస్ 6..ఫస్ట్ వీక్ నో ఎలిమనేషన్

103
bb6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6 ఫస్ట్ వీక్ ముగిసింది. ఇక తొలి వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు ఉండగా ఎవరు ఇంటి నుండి బయటకు వస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే చివరి వరకు ట్విస్ట్ ఇచ్చి ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ నాగ్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంట్లో ఇప్పుడిప్పుడే అందరూ సెట్ అవుతున్నారు.. అందుకే నో ఎలిమినేషన్ అని తెలిపారు నాగ్. సండే ఫన్‌ డేలో భాగంగా కంటెస్టెంట్లతో పాటలు, స్టెప్పులు వేయించారు నాగార్జున. ఒక్కో లేడీ కంటెస్టెంట్ గురించి బాలాదిత్య వర్ణించిన తీరు బాగుంది.

బుట్టబొమ్మ ఎవరు అని నాగార్జున అడిగితే.. కాస్ట్యూమ్ చూస్తే. మెరినా అని సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు బాలాదిత్య. ఆ తరువాత బంతిపువ్వును చూపించాడు. అది శుభానికి సూచిక కాబట్టి.. ఈ ఇంటికి సుదీప శుభానికి సూచిక అని మరో సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు ఆదిత్య. దీంతో ఇంట్లో ఉన్న అమ్మాయిల అందరి గురించి చెప్పమని టాస్క్ ఇచ్చాడు నాగ్.

సత్య గురించి చెబుతూ.. శేఖర్ కమ్ముల హీరోయిన్‌లా ఉంటుంది.. తక్కువ మాట్లాడినా.. స్ట్రెయిట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అభినయ.. రౌడీ, డైనమిక్‌గా ఉంటుందని అన్నాడు. కీర్తి.. బంగారు తల్లి, నేహా.. స్ప్రింగ్, ఇనయ.. మిస్ స్మైల్, ఆరోహి సీమ టపాకాయ్, వాసంతి.. గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్ హౌజ్, ఫైమా.. ఫ్లవర్ కానీ ఫైర్.. ది ఫన్ ఆఫ్ బిగ్ బాస్.. అని చెప్పుకొచ్చాడు. చివరకు గీతూ గురించి చెబుతూ.. గీతక్క.. సీతక్క.. అని అనేశాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -