కృష్ణంరాజు అంత్యక్రియలు..ఏర్పాట్లు పూర్తి

58
- Advertisement -

వెండితెర రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటివద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా మొయినాబాద్ కి తరలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కనకమామిడిలోని ఆయన ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఇప్పటికే ఆ గ్రామా సర్పంచ్ అక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు.

ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు కృష్ణంరాజు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం మిగిల్చింది. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు గారి పార్థివదేహం జూబ్లీహిల్స్,రోడ్ నెంబర్ 28లోని ఆయన ఇంటి మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు.

- Advertisement -