శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల ప్రారంభం..

29
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నెంబర్ 27లో భాగంగా నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపల్లి వద్ద నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకంను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.దీంతో నిర్మల్‌ నియోజకవర్గంలోని 99 గ్రామాల పరిధిలో చెరువులు, కుంటలకు నీరందించనుంది. దీంతో అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

మొదటి యూనిట్‌ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించగా దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో సిస్టర్న్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌, రైట్‌ మెయిన్‌ కెనాల్‌లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్‌-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో గుండంపెల్లి వద్ద 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్‌ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 13.50 కిలోమీటర్లు.

రెండో యూనిట్‌ కింద 5 వేల ఎకరాల ఆయకట్టును నిర్ధేశించారు. దీనికోసం దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో మొదటి పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద రెండో పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తి పోయనున్నారు. దీని పరిధిలో లెఫ్ట్‌ కెనాల్‌ పొడువు 7.50 కిలోమీటర్లు కాగా, రైట్‌ కెనాల్‌ పొడువు 3.75కిలోమీటర్లుగా ఉంది.

Also Read:Rules Ranjan:సెన్సార్ పూర్తి

- Advertisement -