ఐపీఎల్ తమ తొలి టైటిల్ గెలిచి పదేళ్లు గడుస్తుండగా ఈ సారి సెకండ్ టైటిల్ వేటలో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ జట్టు బలంగా కనిపిస్తోంది. బ్యాటర్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు తీసుకోవడం జట్టుకు మరింత శక్తినిచ్చింది. దేశీయంగా సలీల్ అరోరా ఫినిషర్‌గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానుండగా ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇషాన్ కిషన్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉండడం SRHకు పెద్ద ప్లస్. అతను T20ల్లో భారీ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తూ జట్టుకు కీలకంగా మారాడు.
అయితే బౌలింగ్ విభాగంలో SRHకు సమస్యలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు. గత సీజన్‌లో కూడా బౌలింగ్ యూనిట్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. స్పిన్ విభాగంలోనూ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లే ఉండటం జట్టుకు సమస్యగా మారింది. 2025లో స్పిన్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉండింది.
అయితే ఎస్‌ఆర్‌హెచ్ మంత్రం ఒక్కటే. వికెట్లు పడినా దూకుడుగా ఆడటమే. ఇదే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపుతోంది. గత సీజన్‌లో ఓపెనింగ్ జోడీ స్ట్రైక్‌రేట్ 11.47గా ఉండటం వారి దూకుడుకు నిదర్శనం.
Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!

