టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

112
SRH

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-13లో 26వ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హైదరాబాద్‌ ఒక మార్పు, రాజస్థాన్‌ రాయల్స్‌ 3 మార్పులతో బరిలో దిగుతున్నారు. హైదరాబాద్ జట్టులో సమద్ స్థానంలో విజయ్ శంకర్ వచ్చాడు. రాజస్థాన్‌ జట్టులోకి స్టోక్స్, రియాన్ పరాగ్, ఊతప్ప వచ్చారు.

ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్‌ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.