డ్రిపెషన్‌లో ఉన్నానంటున్న సూపర్ స్టార్ కూతురు..

168
Ira Khan

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్ హీరో ఆమీర్‌ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌ ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షాకింగ్ పోస్ట్‌ చేసింది. తాను నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తు ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. అయితే తాను డిప్రెషన్‌ నుండి బయటపడడానికి వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నానని వీడియోలో పేర్కొంది.

అయితే ఇప్పుడు తన పరిస్థితి బాగానే ఉందని, ఏడాది కాలంగా తాను మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, దీంతో తన ప్రయాణంలో అందరినీ భాగం చేయాలనుకున్నానని వ్యాఖ్యానించింది. నేను డిప్రెష‌న్‌లో ఎందుకు ఉన్నాను? ఎందుకు ఇలా చేస్తున్నాను ? అనే విష‌యాలు మీకు చెప్పాల‌ని అనుకున్నాను. దీని వ‌ల‌న మీకు మాన‌సిక ఆరోగ్యంపై ఓ అవ‌గాహ‌న క‌లుగుతుంది అంటూ ఐరా త‌న వీడియోలో పేర్కొంది.