బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి..

212
errabelli
- Advertisement -

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలో గల వడ్డేపల్లి పార్కులో ఆదివారం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్,మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ ఆడ బిడ్డల పండుగకు ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారన్నారు. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాలు బతుకమ్మ పండుగను పట్టించుకునేవారు కాదు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ నిర్వహించి ఆడబిడ్డల పండుగకు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చారు అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసిఆర్, ప్రభుత్వం అన్ని తెలంగాణ పండుగలకు సముచిత స్థానం కల్పించారని మంత్రి అన్నారు.మన రాష్ట్రంలో బోనాల పండుగ,బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు మంత్రి.అందరికీ బతుకమ్మ ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.

అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలో పశువుల దవాఖానలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పశువుల దవాఖానలు చాలా వరకు అభివృద్ధి చెందాయన్నారు. సీఎం కేసిఆర్ ఆలోచనలతో బంగారు తెలంగాణ సాధనలో పశువుల దవాఖానలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమలలో GWMC కమిషనర్ పమేలా సత్పతీ,కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్,మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. కోటిమంది మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా సీఎం కెసిఆర్ అందిస్తున్నారు. నేతన్నకు చేయూతనిస్తున్న ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆపని ప్రభుత్వం సీఎం కెసిఆర్ ప్రభుత్వమని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -