ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రీశాంత్..

62
sreesanth

8 ఏళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుండి క్లీన్ చీట్ తీసుకున్న శ్రీశాంత్…. ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌ చోటు దక్కించుకున్నాడు.

జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్‌ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు. కాగా శ్రీశాంత్‌ బౌలింగ్‌ వీడియోనూ కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ షేర్‌ చేసింది.