సావిత్రిబాయి సేవలను గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత..

21
kavitha

సావిత్రిబాయి 190వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు ఎమ్మెల్సీ కవిత. సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే పేరుతో‌ యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేంద్ర ‌మంత్రి‌ స్మృతి ఇరానీని కోరారు.

గత ఏడాది కేంద్రం ప్రకటించిన యూనివర్సిటీలలో ప్రముఖ మహిళా సంఘ సంస్కర్తల పేరుతో ఏర్పాటు చేయనున్న విభాగాల జాబితాలో సావిత్రి బాయి ఫూలే పేరును చేర్చాలని కవిత విజ్ఞప్తి చేశారు. మహిళల విద్య, హక్కుల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫూలే అని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.