దేశంలో 24 గంటల్లో 18,177 కరోనా కేసులు…

21
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 18,177 కొవిడ్‌ కేసులు నమోదు కాగా 217 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,23,965కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,47,220 యాక్టివ్ కేసులుండగా 1,49,435 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 99,27,310 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో గత 24 గంటల్లో 9,58,125 శాంపిల్స్‌ పరీక్షించగా 17,78,99,783 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.