పెళ్లిపై మ‌న‌సులో మాట చెప్పిన యాంకర్‌ శ్రీముఖి..

94
Sreemukhi

టాలీవుడ్ యాంకర్స్‌ శ్రీముఖి నటిగా, యంకర్‌గా దూసుకుపోతుంది. ఈ అమ్మ‌డు ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానుంది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ సినిమా గ్రూప్స్, గ్రీన్‌ మెట్రో మూవీస్, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలు కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో శ్రీముఖి బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని… ఏదైనా మన అదృష్టాన్ని బట్టే జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని… తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని శ్రీముఖి మనసులో మాట చెప్పింది.