శ్రీముఖి వాదన భలే ఉందే !

62
- Advertisement -

కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా హల్చల్ చేసింది యాంకర్ శ్రీముఖి. ప్రేమ ఇష్క్ కాదల్, ఎట్టుదిక్కుం మధయానై, ధనలక్ష్మి తలుపు తడితే, కుటుంబ కథ చిత్రమ్ వంటి సినిమాలతో కరోనాకి ముందు బాగానే హంగామా చేసింది. ఐతే, ఇప్పుడు శ్రీముఖిని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించడం లేదు. ఇటీవల కొన్ని సైడ్ పాత్రల్లో కనిపించింది. అవి కూడా చిన్న పాత్రలు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లు కూడా రావడం లేదు.

హీరోయిన్ గా పాపులర్ అవ్వాల్సిన ఈ బ్యూటీ, సినిమాల్లో మాత్రం ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోలేకపోయింది?, ఇదే ప్రశ్నని శ్రీముఖిని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. “ఇక్కడ (ఫిలిం ఇండస్ట్రీ) ఎవరి కోటా వాళ్లకు ఉంది. ఎవరు ఏ క్యారక్టర్ చెయ్యాలో కూడా ఒక రూలు రాసి పెట్టి ఉంటుంది. చెల్లి, తల్లి పాత్రలు కూడా కొందరికే అవకాశాలొస్తాయి,” అని శ్రీముఖి సెటైరికల్ గా చెప్పింది.

ఇన్ డైరెక్ట్ గా తమ ‘క్యాంప్’లో ఉండే వాళ్ళకే దర్శక, నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తారు అని శ్రీముఖి అంటోంది. బాగా క్రేజ్ ఉండి, పాపులారిటీ ఉన్న వాళ్లకు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకుండానే అవకాశాలు వస్తాయని, కానీ, మిగతావాళ్లకు మాత్రం ఆఫర్లు రావాలంటే దర్శక, నిర్మాతల గుడ్ బుక్స్ లో ఉండాలి అని శ్రీముఖి చెబుతుంది. మొత్తమ్మీద సినిమాల్లో తాను సక్సెస్ కాకపోవడానికి దర్శకనిర్మాతలే ముఖ్య కారణం అన్నట్టు ఉంది శ్రీముఖి వాదన.

Also Read: ట్యూటర్‌ ను పెట్టుకొని మరీ..

- Advertisement -