సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఎవైటింగ్ మూవీలో కుర్ర హీరోయిన్ శ్రీ లీల ఫిక్స్ అయింది. సంప్రదింపులు జరుగుతుండగానే ఈ హీరోయిన్ పేరు బయటికి వచ్చేసింది కానీ ఆమె డేట్స్ కారణంగా మరికొన్ని ఆప్షన్స్ చూశాడు త్రివిక్రమ్. తాజాగా శ్రీ లీలను ఫైనల్ చేసేశారని తెలుస్తుంది. ప్రస్తుతం అమ్మడు చేతిలో అరడజను సినిమాలున్నాయి.
రాఘవేంద్ర రావు పరిచయం చేసిన ఈ కన్నడ బ్యూటీ తెలుగులో ఇప్పటికే రవితేజ ధమాకా , రామ్ తో మరొకటి , వైష్ణవ్ తేజ్ తో ఇంకొకటి చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో కూడా శ్రీలీల ను తీసుకున్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఓ కన్నడ తెలుగు బైలింగ్వెల్ ఒకటి ఒప్పుకొని షూట్ లో జాయిన్ అయింది శ్రీలీల. ఈమె చేతిలో ఇంకో కన్నడ సినిమా కూడా ఉంది. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ లో కూడా భాగం అవ్వనుంది.
మహేష్ సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు సెకండ్ లీడ్ గా శ్రీలీల కనిపించనుందట. త్రివిక్రమ్ సినిమాల్లో చాలా మంది హీరోయిన్ సెకండ్ ఫీమేల్ లీడ్ చేశారు కానీ వారెవరికి రిలీజ్ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు. ఇప్పటికే భారీ ఆఫర్స్ మధ్య నలిగిపోతున్న ఈ కన్నడ బ్యూటీ మహేష్ సినిమా కాబట్టే ఒప్పుకొని ఉండొచ్చు. మరి ఈ బ్యూటీ ను త్రివిక్రమ్ తన సినిమాలో ఎలా చూపిస్తాడో ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడో ? వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..