రివ్యూ : శ్రీకారం

1111
sreekaram movie review
- Advertisement -

టాలీవుడ్‌ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం శ్రీకారం. కొత్త దర్శకుడు బి కిషోర్ శ్రీకారం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య వరస పరాజయాల్లో ఉన్న శర్వానంద్‌కు శ్రీకారం విజయం కీలకంగా మారింది. ఈ సినిమాలో శర్వాకు జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. శ్రీకారం సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా ఈరోజు మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా కథ ఎలా ఉంది.. ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూద్దాం..

కథ:

ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయంలోకి రావటం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఓ యువకుడు రైతుగా మారి వ్యవసాయం చేయాలనుకుంటాడు. వ్యవసాయం చేస్తే నష్టాలు కాదు.. లాభం వచ్చేలా ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తాడు. అయితే ఆ గ్రామంలో విలన్ రైతులకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తాడు. రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధర కి వారి భూములను కొనుక్కుంటాడు. ఊరిలో శర్వానంద్ రావు రమేష్ కొడుకు గా కనిపిస్తాడు. బాగా చదువుకున్న శర్వానంద్ అతని తండ్రి.. సాయి కుమార్ కి ఉన్న అప్పు గురించి తెలుసుకుంటాడు. లగ్జరీ లైఫ్ వదలి గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత హీరో, విలన్ కు ఎలా బుద్ధి చెబుతాడు. గ్రామస్తుల మనసుని ఎలా గెలుచుకుంటాడు. ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎదురైన పరిస్థితులేంటి..?అన్నదే కథ

ప్లస్ పాయింట్స్‌:

శర్వానంద్ తో పాటు హీరోయిన్ ప్రియాంక కూడా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ కనబరిచింది. సాఫ్టవేర్ నుంచి రైతుగా మారిన పాత్రలో శర్వానంద్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు బి కిశోర్‌కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని తీశాడు. రైతు సమస్యలను తెరపై చూపించడానికి బి కిశోర్ తీవ్రంగా కసరత్తు చేశాడనే చెప్పాలి. ఈ సినిమాతో విమర్శకుల నోళ్లు మూయించేలా తీశాడు కిశోర్. ఇక సినిమా ఫస్ట్ ఆఫ్ శర్వా, ప్రియాంకల మధ్య లవ్ సీన్న్ సాగుతుంది. నిత్యం తన పనితో బిజీగా ఉండే అబ్బాయిని ఎలా పడేయ్యాలి అనే కాన్సెప్టులో ప్రియాంక నటన ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో అసలు కథ స్టార్డ్ అవుతోంది సాఫ్ట్ వేర్ ఉద్యోగి..రైతుగా మారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కోణంలో చూపించాడు. అయితే గతంలో మహేష్‌ మహర్షి సినిమా వచ్చినప్పటికీ కొత్త కోణంలో శ్రీకారం చూపించాడు దర్శకుడు. ఈ చిత్రం ద్వారా హీరో శర్వానంద వ్యవసాయం గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని కథతో కనెక్ట్ అవ్వడం విశేషం. ఈ చిత్రం వ్యవసాయ ఆధారిత తెలుగు ప్రేక్షకులకు గట్టిగా తగులుతుంది. ఎమోషన్స్ అందరినీ కదిలిస్తాయి. ఈ వారంలో తప్పనిసరిగా చూసే చిత్రంగా ‘శ్రీకారం’ నిలుస్తుందనే చెప్పాలి. కథ కూడా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు.

సాంకేతిక విభాగం:

ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి అవుట్ పుట్ వచ్చేది.. సినిమా నరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మరి ఇంత ఫాస్ట్ గా పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ ఫీల్ వచ్చేది. ఈ సినిమా ఎడిటింగ్ మరింత పనితనం కనబర్చవచ్చు. చాలా అనవసరమైన సన్నివేశాలు ఉండగా పెద్దగా కథ ఉపయోగం లేని చిన్న చిన్న సన్నివేశాలు మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. కథలో కొత్త అంశాలు ఉన్నప్పటికీ తర్వాత జరగబోయే సీన్లను ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తారు. రావురమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళి శర్మ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఆకట్టుకుంది.

తీర్పు: మొత్తానికి శ్రీకారం ఓ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం అనే చెప్పాలి.

చిత్రం: శ్రీకారం
విడుదల తేదీ: 11-03-2021
రేటింగ్‌: 3/5
నటీనటులు: శర్వానంద్‌, ప్రియా అరుళ్‌ మోహన్‌
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
నిర్మాత: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
దర్శకత్వం: బి.కిషోర్‌

- Advertisement -