దేవాలయాలకు పూర్వవైభవం: ఎర్రబెల్లి

185
dayakar rao
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పాలనలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఐన ఓలు మల్లికార్జున స్వామి గుడిని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ ఉద్యోగులు, అర్చకులు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…మహాశివరాత్రి శివ పార్వతుల పెండ్లి రోజని, లింగోద్భవం జరిగిన రోజని మంత్రి చెప్పారు. ఈ రోజు దర్శనం అత్యంత పవిత్రమైనదిగా శివ భక్తులు భావిస్తారని అన్నారు. లయకారుడు శివుడు, శక్తి స్వరూపిణి పార్వతి ల ఆశీర్వచనాల తో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే సీఎం కెసిఆర్ పరిపాలనలో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ గారు దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాల పెంపు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి, వంటి అనేకానేక చర్యలతో దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి చెప్పారు.

- Advertisement -