పవన్ సరసన కుర్ర భామలు

29
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీస్ సాక్షి వైద్య, శ్రీ లీల హీరోయిన్స్‌గా నటించనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. ఇప్పటికే సాక్షి వైద్య, శ్రీ లీల బిజీ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా శ్రీలీల అటు మహేష్ బాబు, ఇటు పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తోంది. కాబట్టి.. రానున్న రెండేళ్లలో శ్రీలీల నే టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

పవన్ కల్యాణ్ ఇటీవల నటించిన చిత్రం ‘BRO’. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్’ను సొంతం చేసుకుంది. ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో పవన్ మళ్లీ మాస్ సినిమా పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పవన్ ప్రస్తుత ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫుల్ మాస్ సినిమా. అందుకే ముందుగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పవన్ మళ్లీ ఉస్తాద్ సెట్‌లో అడుగుపెట్టనున్నారు.

Also Read:బాబోయ్.. బ్లాక్ బ్యూటీ బోల్డ్ ముచ్చట్లు

ఈ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 5న మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నాని టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు స్టార్ కొడుకుకే ఛాన్స్ రావడం ఎంతవరకు న్యాయమని అకీరా నందన్ గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు రేణూ దేశాయ్ రిప్లై ఇచ్చారు. అకీరా హీరో కావాలని, సినిమాల్లోకి రావాలనుకోలేదు,అప్పుడే అతనిపై ఇంత నెగిటివిటీ ఎందుకని ఆమె ప్రశ్నించారు.

Also Read:రామ్ కోసం బాలయ్య వస్తున్నాడోచ్

- Advertisement -