ఇటు బాలయ్య అటు శ్రీలీల!

22
- Advertisement -

బాలకృష్ణపై హీరోయిన్ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపిస్తే.. శ్రీలీల పై బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అవుతున్నాయి. ఇంతకీ శ్రీలీల ఏం మాట్లాడింది అంటే.. ”బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది. నటనకు అవకాశం ఉంది కాబట్టే ఈ సినిమాలోని విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను” అని శ్రీలీల చెప్పుకొచ్చింది. మొత్తానికి బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్ అంటూ శ్రీలీల క్రేజీ కామెంట్స్ చేసింది.

ఇక ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌ మీట్‌లో శ్రీలీలపై అటు నటసింహం నందమూరి బాలకృష్ణ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమాలో తన కూతురి పాత్రలో నటించిన శ్రీలీల అద్భుతంగా నటించిందని తెలిపారు. ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ అవసరం లేకుండా పాత్రలో జీవించిందని కితాబిచ్చారు. ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశీర్వందించారు. మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద శ్రీలీలకు గ్లిజరిన్ అవసరం లేదు అని బాలకృష్ణ చెప్పడం విశేషం.

అన్నట్టు ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”రీసెంట్‌గా ఎవడో వెదవ నన్ను విగ్గు పెట్టుకుంటాడు? కదా అని అన్నాడు. అవును నేను విగ్గు పెట్టుకుంటాను నువ్వెందుకు గడ్డం పెట్టుకున్నావు అని అన్నాను. మనదంతా ఓపెన్ బుక్. ఎవ్వడికీ భయపడే పనిలేదు” అని తెలిపారు. వైసీపీ నేత కొడాలి నానిని ఉద్దేశించి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read:చిరస్ధాయిగా నిలిచే..’భగవంత్ కేసరి’

- Advertisement -