లెనిన్‌ నుండి తప్పుకున్న శ్రీలీల?

13
- Advertisement -

అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం “లెనిన్”. ఈ సినిమాలో అఖిల్ సరసన తొలుత కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. షెడ్యూలింగ్ సమస్యలే కారణమని తెలుస్తోండగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

కొన్ని నెలల క్రితం విడుదలైన లెనిన్ టీజర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని ఎస్‌.ఎస్‌. థమన్ సమకూరుస్తున్నారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

- Advertisement -