వెంకీ-త్రివిక్రమ్ గుడ్ న్యూస్!

9
- Advertisement -

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం వెంకీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్ మూవీనే. త్రివిక్రమ్ మాటలకి వెంకీ కామెడీ టైమింగ్ తోడవడంతో ప్రేక్షకుల నుంచి ఉహించని రెస్పాన్స్ వచ్చింది.

తర్వాత వచ్చిన మల్లీశ్వరి మూవీకి కూడా మాటలు అందించిన త్రివిక్రమ్ తన మార్క్ స్పష్టంగా చూపించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సినిమాను ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీంతో త్వరలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసి ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. వెంకటేష్‌ 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

- Advertisement -