ఆమె కోసం త్రివిక్రమ్ అలా రాశాడా ?

19
- Advertisement -

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మహేష్ బాబు – త్రివిక్రమ్ ‘SSMB28’లో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఐతే, మహేష్ పక్కన శ్రీలీల ఎలా ఉంటుంది ? అనే డౌట్ ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలీల క్యారెక్టర్ గురించి లేటెస్ట్ అప్‌ డేట్‌ ప్రకారం, త్రివిక్రమ్ ఈ చిత్రంలో శ్రీలీల కోసం బబ్లీ క్యారెక్టర్‌ను రాశాడట. స్పష్టంగా చెప్పాలంటే.. శ్రీలీల ఈ చిత్రంలో మహేష్ కి మరదలుగా కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో శరవేగంగా జరుగుతుంది. షూట్ కి మహేష్ గ్యాప్ ఇవ్వలేదు. పైగా కంటిన్యూస్ గా షూటింగ్‌లో మహేష్ పాల్గొంటున్నాడు. దాంతో SSMB28కి సంబంధించిన షూట్ ను అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే పూర్తి అవుతుందట. సమ్మర్ తర్వాత రాజమౌళి సినిమా మీదకు మహేష్ వెళ్లాల్సి ఉంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ సినిమాని చాలా వేగంగా పూర్తి చేయడానికి మహేష్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

అన్నట్టు పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -