నేను బ్రతికే ఉన్నా!

52
- Advertisement -

సోషల్ మీడియాలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు చనిపోయారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో స్పందించారు కోట. తాను ఇంకా బ్రతికే ఉన్నానని అప్పుడే చంపేయకండని విజ్ఞప్తి చేశారు.

తాను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం బాధకరమని.. కేవలం డబ్బు సంపాదన కోసం ఇలాంటి వార్తలు రాయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మొదని కోట తెలిపారు. ఉదయం నుంచి 50పైగా ఫోన్లు వచ్చాయని, పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారని దయచేసి ఇప్పటికైనా అసత్య ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -