కాబోయే వాడు అలా ఉండాలి

71
- Advertisement -

యంగ్ బ్యూటీ శ్రీలీల తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయింది. ఐతే, తక్కువ టైంలోనే ఎక్కువ ఫ్లాపులు మూటగట్టుకుంది. అయినా, అమ్మడికి క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా కూడా శ్రీలీల ఖాతాలో ఉంది. అలాగే, ఆమె చేతిలో శర్వానంద్ 30వ చిత్రంతో పాటు తమిళ, మలయాళ చిత్రాలున్నాయి. అందుకే, కెరీర్ విషయంలో శ్రీలీల ఫుల్ హ్యాపీగా ఉంది. ఇదే విషయాన్ని ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు వస్తూనే ఉన్నాయి అని, ఇక నుంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటా అని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే, తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా శ్రీలీల చెప్పుకొచ్చింది. పైగా తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలను చాలా వివరంగా వివరించింది. తనకు కాబోయే వాడు తనను బాగా నవ్వించాలని.. అలాగే తానెప్పుడూ నవ్వుతుండాలి అని శ్రీలీల చెప్పింది. అదేవిధంగా డౌన్ టు ఎర్త్ ఉండాలని, తనది కానీ చోట కూడా హుందాతనం చూపాలని.. అదే సమయంలో చాలా బలంగా ఉండాలని, నిలబడాలి అని, అన్నిటికీ మించి అతనిలో నిజాయితీ ముఖ్యం అని శ్రీలీల చెప్పింది.

Also Read:IPL 2023:పాపం ఆర్సీబీ.. ఏంటి ఈ పరిస్థితి !

శ్రీలీల వయసు ఇంకా 21 ఏళ్లే. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చే టైంకి ఆమె అభిప్రాయాలు, కోరికలు, అంచనాలు మారొచ్చు. ఏది ఏమైనా కాబోయే మొగుడు విషయంలో శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే శ్రీలీల చాలా తెలియగలది అని టాక్.

Also Read:ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

- Advertisement -