స్పుత్నిక్‌-వీ సృష్టికర్త హత్య..!

16
- Advertisement -

స్పుత్నిక్-వీ సృష్టికర్త ఆండ్రే బోటీకివ్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. రష్యాకు చెందిన ఈ శాస్త్రవేత్త స్వంత అపార్ట్‌మెంట్‌లోనే శవమై కనిపించారు. గమలేయా నేషనల్‌ రీసర్చ్‌ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. అతన్ని గొంతుమీద బెల్ట్‌తో నులిమేసినట్లు రష్యామీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ కేసుకు సంబంధించిన అనుమానితుడిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఇతన్నిపై డొమెస్టిక్ క్రైమ్‌ కింద మర్డర్‌ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్టు పేర్కొంది. బోటీకివ్‌కు రష్యా ప్రభుత్వం 2021లో అత్యున్నత పురస్కారాన్ని ఆదేశ అధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకున్నారు. స్పుత్నిక్-వీ టీకాను 18మంది శాస్త్రవేత్తలు కలిసి డెవలప్ చేశారు. వారిలో బోటీకివ్ ఒకరు.

ఇవి కూడా చదవండి…

నోబెల్ గ్రహీత..బియాలియాట్‌ జైలుశిక్ష.!

వారికి మాత్రమే ఓపీఎస్..కేంద్రం ప్రకటన

త్వరలో నానో డీఏపీ..కేంద్రం..!

- Advertisement -