ఆమె ఆశలన్నీ మహేష్ పైనే !

16
- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అందాల కుర్ర భామల్లో శ్రీలీల ఒకరు. హీరో శ్రీకాంత్ తనయుడు హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందంతో శ్రీలీల ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారంతా ఫిదా అయ్యారు. చెక్కిన శిల్పం లాంటి ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినా మొత్తానికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.

అయితే, ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, శ్రీలీల మాత్రం స్టార్ డమ్ తెచ్చే సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. శ్రీలీల స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వాలి అంటే.. ఆమెకు ఓ భారీ హిట్ పడాలి. ఇన్నాళ్లు తన సినిమాతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన శ్రీలీల కు మహేష్ సినిమా గొప్ప హోప్స్ ను కలిగిస్తోంది. ఈ సినిమాతో తన దశతిరుగుతుందని శ్రీలీల బోలెడన్ని ఆశలతో ఉంది.

ఈ సినిమాలో మహేష్ కు రెండో జోడీగా కనిపించనుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తో పాటు మరో బ్యూటీ పూజా హెగ్డే కూడా నటిస్తోంది. ఆమె మెయిన్ హీరోయిన్. ఐతే, శ్రీలీల – మహేష్ పై త్రివిక్రమ్ ఓ క్రేజీ రొమాంటిక్ సాంగ్ ను డిజైన్ చేశాడు. ఈ సాంగ్ అదిరిపోతోంది అని, ఈ సాంగ్ తో శ్రీలీల అందం డబుల్ అవుతుంది అని, కాబట్టి ఈ సినిమా శ్రీలీలకి బాగా ప్లస్ అవుతుందని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా అమ్మడి కెరీర్ కు ఎంతవరకు కలిసొస్తుందో.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ హీరోయిన్ కి కూడా ఇవ్వాలట!

మార్చి8..చమ్కీల అంగీలేసి సాంగ్‌

ఆ బ్యూటీ ఎన్టీఆర్ ను పట్టేసింది!

- Advertisement -