‘స్పిరిట్’ స్టోరీ ఇదేనా.. పూనకాలే!

12
- Advertisement -

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ మూవీని ‘స్పిరిట్’ పేరుతో ప్రభాస్ తో చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించరాయన. అయితే అంతకంటే ముందు యానిమల్ పార్క్ చేస్తాడనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని తన తదుపరి చిత్రం స్పిరిట్ మూవీనే అని ఇటీవల స్పష్టం చేశారు సందీప్ రెడ్డి వంగ. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉండబోతుంది ? ప్రభాస్ ను సందీప్ వంగా ఎలా చూపించబోతున్నాడు ? అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో గట్టిగానే మెదులుతున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గతంలోనే క్లారిటీ ఇచ్చారు.

ఇక పోతే ప్రస్తుతం ఈ మూవీ స్టోరీకి సంబంధించి మెయిన్ లైన్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న హీరో కు తన దగ్గరి వాళ్ళే అక్రమాలకు పాల్పడితే వారిని హీరో ఎలా ఎదుర్కొంటాడనే కథాంశంతో మూవీ ఉండనుందట. అయితే స్టోరీ లైన్ పాతదే అయినప్పటికి సందీప్ వంగా స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడం ఖాయం. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ యొక్క స్టోరీ లైన్ పాతదే అయినప్పటికి హీరో క్యారెక్టర్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేశాయి. దాంతో స్పిరిట్ లో కూడా సందీప్ అదే మ్యాజిక్ చేయడం ఖాయమని ప్రభాస్ అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏ.డి, రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ లేదా సాలార్ 2 చేసే అవకాశం ఉంది.

Also Read:‘బహుముఖం’ మూవీ రివ్యూ..

- Advertisement -