ఆ విషయంలో బాహుబలి కంటే RRR ఎక్కువట..!

633
rrr
- Advertisement -

బాహుబలి సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

భారీ అంచ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, మిగ‌తా భాగాన్ని పూణేలో తెర‌కెక్కించ‌నున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డింది. లాక్ డౌన్ తొలిగించాక మిగిలిన షూటింగ్‌ని త్వ‌రగా పూర్తి చేసి ఆ తర్వాత గ్రాఫిక్స్,సీజే వ‌ర్క్స్ కూడా వీలైనంత తొంద‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 8న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కానుంది.

నేప‌థ్యంలో, చిత్ర ర‌న్ టైం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా సంచలనం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ రన్ టైం 3 గంటలకు దగ్గరగా ఉంటుందట‌. గతంలో వచ్చిన ‘బాహుబలి’ రెండున్నర గంటలకి పైనే వుంది. ‘బాహుబలి 2’ విషయానికొస్తే, 10 నిమిషాల తక్కువ 3 గంటల నిడివిని కలిగి వుంది. ఇప్పుడు దీనిని మించి ఆర్ఆర్ఆర్ ఉంటుంద‌ని అంటున్నారు. ప్రధాన పాత్రల ప్రాధాన్యత .. సందర్భానికి తగిన పాటల కారణంగా 3 గంటల నిడివిని కలిగి ఉంటుందని అంటున్నారు.

- Advertisement -