సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు- అల్లం నారాయణ

333
kcr
- Advertisement -

మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్‌లో జర్నలిస్టులకు మాస్కులు,సానీటైజర్లు,నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరైయ్యారు. ఈసందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. వైద్యులు పోలీసులతో పాటుగా అత్యవసర సర్వీసుల్లో ఉన్న జర్నలిస్టులు కూడా ప్రభుత్వానికి ప్రజలకి మద్యల అనుసంధాన కర్తలుగా పని చేస్తున్న జర్నలిస్టుల పరిస్థితులు బాగలేవు. చాలా పత్రికల్లో కూడా స్టింగర్లకు జీతాల్లేని పరిస్థితి అయిన ఈ సమయంలో చురుగ్గా పనిచేస్తున్నారు.

వారికి జీతాలు లేవు కనుక తెలంగాణ మీడియా అకాడమీ నుండి నిత్యావసర వస్తువులను అందించాలన్న ఉదేశ్యంతో లాక్ డౌన్ పెరిగిన నేపథ్యంలో ఈ రోజు ఈ పంపిణీ ప్రారంబించాము. జర్నలిస్టుల వెల్ఫేయిర్ ఫండ్ నుండి అత్యవసరంగా కొన్ని నిధులు తీసి జర్నలిస్టులకు కనీస కుటుంబ అవసరాలు ఆదుకునేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. వైద్యులు, పోలీసులు,ఇతర ప్రత్యేకంగా ఉండే వాటితో పోటీగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 24 గంటలు పని చేస్తున్నారు. ఈరోజు 700 జర్నలిస్టులకు పంపిణీ చేస్తున్నాం. జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లం నారాయణ తెలిపారు.

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పేద జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వారూ ఇబ్బంది పడకూడదని మీడియా అకాడమీ ఈ నిర్ణయం తీసుకొని దిన్ని ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్న అందరూ జర్నలిస్టులకు ఇవ్వాలన్నది మీడియా అకాడమీ ఉదేశ్యం.

దాతలు మీడియా అకాడమీని సంప్రదించి.. జిల్లాలో జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారూ కావున సహకరించగలరు. ఈ కార్యక్రమం చేస్తున్న మీడియా అకాడమీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టు వెలిఫెర్ ఫండ్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న జర్నలిస్టుల ఆదుకుంటున్న మీడియా ఆకాడమికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -