ఆర్ఆర్ఆర్ సాంగ్స్‌…లేటెస్ట్ అప్‌డేట్…!

587
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్ఆర్. సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్న తాజాగా మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీలో కేవలం మూడు పాటలే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట రాజమౌళి. దీనివల్ల రన్‌ టైం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారట. అయితే దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిఉంది.

రీసెంట్‌గా జరిగిన లాంగ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరించగా హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌తో పాటు ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్స్‌ను తీయనున్నారట.

ఈ మూవీలో చరణ్‌..అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు. చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు భాష నేర్చుకుంటోంది. ఇక ఎన్టీఆర్ సరసన విదేశీ భామ నటించనుంది. 2020 జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఎపిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -