ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయం సాధించడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ జగన్నాథ్ తన తర్వాతి మూవీని విజయ్ దేవరకొండతో తీయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను రెడీ చేస్తున్నాడు పూరీ. ఇప్పటికే సగం వరకు పూర్తిచేసిన పూరీ మిగతా సగం స్క్రీప్ట్ కోసం గోవాకు వెళ్లనున్నాడు. పూరీ జగన్నాథ్ సినిమా కథలు రాసుకోవడానికి ఎక్కువగా బ్యాంకాక్ వెళ్తుంటారు.
అయితే ఈ మధ్య పూరీకి బ్యాంకాక్ పెద్దగా కలిసిరాకపోవడంతో గోవాకు వెళ్తున్నాడు. బ్యాంకాక్ తరువాత ఆయనకి బాగా నచ్చిన ప్రదేశం గోవానే. అందువల్లనే అక్కడ తన సినిమాకి సంబంధించిన సీన్ ఒకటైనా తీస్తుంటాడు. బౌండ్ స్క్రిప్ట్ తోనే ఆయన అక్కడి నుంచి తిరిగి వస్తాడని అంటున్నారు. ఈసినిమాను కూడా పూరీ తన సొంత బ్యానర్ లోనే తెరకెక్కించనున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈచిత్రానికి టైటిల్ కూడా ప్రకటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఖారారు చేశారు. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈనెల 20వ తేదిన విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రయూనిట్. ఈమూవీ షూటింగ్ పూర్తైన తర్వాత విజయ్ తో సినిమా చేయనున్నాడు పూరీ జగన్నాథ్.

